రాష్ట్రంలో ఆరు నెలల కాలంలో 2,600 రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేసి.. రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవర్ధన్ గౌడ్ తన సొంత నిధులు 24 లక్షల రూపాయలతో నిర్మించిన ఏసీ రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ.. రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు.