కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందని...ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. ప్రజలు నిర్లక్ష్య ధోరణి వీడి కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి... ప్రజాప్రతినిధులు ప్లాస్మాదానంలో ముందుండి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.
కరోనా బాధితులను అంటరానివారుగా చూడొద్దని...వారిలో ధైర్యం నింపేలా ప్రజలు వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ ఐసీయూ వార్డు, 40 పడకల ఆక్సిజన్ వార్డును మంత్రి ప్రారంభించారు. ప్రత్యేక కొవిడ్ అంబులెన్స్‌లను జెండా ఊపి వినియోగంలోకి తీసుకొచ్చారు.
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో 32 పడకల ఐసోలేషన్ వార్డు ప్రారంభించారు. ఆసుపత్రికి మరో రూ.2.28 లక్షలు సీఎస్‌ఆర్ నిధుల కింద సమకూర్చుతామన్నారు. తనవంతుగా రూ.20 లక్షలు ఇస్తున్నానని తెలిపారు. జిల్లాలో రోజుకు 1000 టెస్టుల సామర్థ్యానికి అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా బాధితుల పట్ల మానవత్వంతో ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కరోనా కోసం..