ఇటీవల కరోనాతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం అంజయ్య కుటుంబసభ్యులు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
Minister KTR: 'అడిషనల్ కలెక్టర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం' - ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ఇటీవల కరోనాతో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబసభ్యులు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు.
'అడిషనల్ కలెక్టర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం'
అంజయ్య చాలా సమర్థ అధికారి అని, ఆయన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:PRC: ఉద్యోగులకు గుడ్‌న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!