Minister KTR filed Nomination in Sirscilla :కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా? కేసీఆర్(CM KCR) ఇచ్చే సంక్షేమ పథకాలు కావాలా.. కాంగ్రెస్ చేసే స్కాములు కావాలా.. అని మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రజలను అడిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయిదోసారి నామినేషన్ దాఖలు చేశానన్నారు.
ఆర్మూర్‌లో ప్రచార రథం పైనుంచి ముందుకు పడిన కేటీఆర్ - స్వల్ప గాయాలు
Telangana Assembly Elections 2023 :రాజకీయంగా తనకు జన్మనిచ్చి, విదేశాల్లో గుర్తింపునిచ్చింది.. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నానన్నారు. గడిచిన 15 ఏండ్లుగా అవినీతి రహితంగా పనిచేసి.. సిరిసిల్ల ముఖ చిత్రం మార్చుకున్నామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాని.. తనను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు.
KTR fires on Congress in sirscilla :సిరిసిల్లలో తాను చేసిన అభివృద్ధికి సంబంధించిన ప్రగతి నివేదకను ఇంటింటికి పంపిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే ఎన్నికలని.. 55 ఏండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్కు ఓటు వేస్తారా.. సంక్షేమం అభివృద్ధి చేసిన తనను గెలిపిస్తారా? ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు.