Minister Ktr On Dalita Bandhu: దళితబంధు పథకంతో దళితుల రూపురేఖలు మార్చడానికి ఆలోచించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. దళితబంధు నిధులతో అందరూ వాహనాలే కాకుండా... వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి సంపదను రెట్టింపు చేసుకోవాలని కోరారు. దళితబంధు నిధులతో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. రూపాయి పెట్టుబడితో రూపాయిన్నర రాబడి గురించి ఆలోచించాలి. దేశంలో మంచి పని చేయడానికి లక్ష తొంభై అడ్డంకులు ఉంటాయి. కానీ చెడు పని చేయడానికి ఒక్కటి అడ్డంరాదు. దళితబంధు నిధులతో పలు రకాల వ్యాపారాలు చేస్తామని లబ్ధిదారులు అంటున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింతగా వృద్ధి సాధించవచ్చు. కేవలం ఎస్సీలకే కాదు.. క్రమంగా మిగతా వర్గాలకు దళితబంధు తరహా పథకం ఇస్తాం. సమాజంలో రెండే కులాలున్నాయి.. పేద కులం, ధనిక కులం. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే నేను రాను. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు దళితబంధు పథకాన్ని విజయవంతం చేయాలి.
-- కేటీఆర్, మంత్రి