రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు.. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు మూడు లక్షల మందికి రేషన్ కార్డులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లబ్ధిదారులకు కేటీఆర్ ఆహార భద్రతా కార్డులు అందజేశారు.
Minister KTR: 'అర్హులందరికీ రేషన్ కార్డులు.. పేదల సంక్షేమమే లక్ష్యం'
రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రతా కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిరిసిల్లలో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
మొదటగా పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో రూ.2.20 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మెరుగైన, పారదర్శక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్కానింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో కరోనాతో మృతి చెందిన తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పట్టణంలోని సయ్యద్ సాబీర్, కౌన్సిలర్ దిడ్డి రాజు, మాధవిల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:NEW RATION CARDS: రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ..