KTR విద్యార్థులు ఆలోచనలకు పదునుపెడితే ప్రపంచమే అబ్బురపడేలా ఆవిష్కరణలు చేయవచ్చని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన 'గిఫ్ట్-ఎ-స్మైల్' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సాంసంగ్, ఆకాశ్ బైజూ సంస్థలు సిరిసిల్ల కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేసేందుకు ముందుకొచ్చాయి. 'గిఫ్ట్-ఎ-స్మైల్' కార్యక్రమంలో భాగంగా తొలి రెండు విడతల్లో.... అంబులెన్స్‌లు, త్రిచక్రవాహనాలను అందించగా.... మూడో విడతలో సాంసంగ్, ఆకాశ్ బైజూ సంస్థలు ఈ ల్యాప్‌టాప్‌లను అందించాయి.
కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.... జూనియర్ కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. ప్రపంచంతో పోటీపడుతూ.... విద్యార్థులు చదువులు సాగించాలన్న కేటీఆర్.... అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటే, తప్పక విజేతలవుతారని చెప్పారు. ఉన్నత విద్యలో, ఆవిష్కరణల్లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల నుంచి మరింతగా వస్త్రాల ఉత్పత్తి పెరగాలని కేటీఆర్ సూచించారు.