తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Comments: 'తెరాసపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దకండి..' - సిరిసిల్లలో కేటీఆర్​ పర్యటన

KTR Comments: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​.. సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని ద్రౌపది ముర్మును మంత్రి కోరారు.

Minister KTR Comments on union ministers
Minister KTR Comments on union ministers

By

Published : Jul 22, 2022, 3:19 PM IST

KTR Comments: జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని.. అందుకు తామెంతో గర్విస్తున్నామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు. గిరిజన రిజర్వేషన్‌ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్న కేటీఆర్​.. రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని ద్రౌపది ముర్మును కోరారు. పోడు భూముల అంశానికి కేంద్రం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం ప్రతిబంధకంగా ఉందని.. కటాఫ్‌ తేదీని మార్చేలా చౌరవ తీసుకోవాలన్నారు. తెరాసపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు.

"ఆదర్శగ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రమే చెప్పింది. మేము తెలంగాణకు ఏదో ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. 8 ఏళ్లలో తెలంగాణకు దేశం ఇచ్చింది తక్కువ. దేశానికి తెలంగాణ ఇచ్చింది ఎక్కువ. జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నాం. కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీముర్ముకు తెరాస పక్షాన శుభాకాంక్షలు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి. గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలి." - కేటీఆర్​, మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details