తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Comments: 'ఓపిక నశిస్తే కేంద్రంపై పోరాటానికి దిగాల్సి వస్తుంది..' - నేతన్నలకు అండగా

KTR Comments: సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన చేపట్టిన మంత్రి కేటీఆర్​.. కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొవిడ్​ పరిస్థితులు, వ్యాక్సినేషన్​, పాఠశాలల ఆధునీకరణ, చేనేత రంగంపై అధికారులతో చర్చించారు. టెక్స్‌టైల్‌ పార్కుకు నిధుల కోసం కేంద్రాన్ని పలుమార్లు కోరినా ఎలాంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

minister KTR comments on central government about Textile park in siricilla
minister KTR comments on central government about Textile park in siricilla

By

Published : Jan 21, 2022, 4:15 PM IST

Updated : Jan 21, 2022, 4:43 PM IST

'ఓపిక నశిస్తే కేంద్రంపై పోరాటానికి దిగాల్సి వస్తుంది..

KTR Comments: చేనేత కార్మికుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఏడున్నర ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా.... మోదీ సర్కార్‌ పట్టించుకోవడం లేదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన చేపట్టిన మంత్రి.. కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజా ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని కేటీఆర్​ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా పంపిస్తున్నామని... రాజకీయాలు మాని రాష్ట్ర నేతల కోసం పనిచేయాలని కేటీఆర్‌ హితవు పలికారు. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని స్పష్టంచేశారు.

నేతన్నలకు కేంద్రం మొండి చేయి..

"నేతన్నలకు అండగా నిలిచే ప్రయత్నం కేంద్రం చేయట్లేదు. నేతన్నలకు చేదోడుగా నిలవాలని కేంద్రమంత్రికి లేఖ పంపాం. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు వరంగల్‌లో ఏర్పాటవుతోంది. 1200 ఎకరాల్లో కాకతీయ మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండు పరిశ్రమల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. టెక్స్‌టైల్‌ పార్కుకు నిధుల కోసం కేంద్రాన్ని పలుమార్లు కోరాం. టెక్స్‌టైల్‌ పార్కుకు రూ.897 కోట్లు మంజూరు చేయాలని.. చేనేత, మరమగ్గాల ఆధునీకరణకు సహకరించాలని కోరాం. ఆధునీకరణ కోసం రాష్ట్రం కూడా సగం నిధులు భరిస్తుంది. రాష్ట్రానికి 13 చేనేత సమూహాలు మంజూరు చేయాలి. సిరిసిల్లకు మెగాపవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలి. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుంది." - కేటీఆర్​, మంత్రి

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో 479 బృందాలు ఫీవర్‌ సర్వే చేస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచామన్నారు. బూస్టర్‌ డోస్‌ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు కేటీఆర్​ పేర్కొన్నారు. కొవిడ్‌ తీవ్రత అంత ఎక్కువ లేదని వైద్యారోగ్యశాఖ చెబుతోందని కేటీఆర్‌ తెలిపారు. వేములవాడలో వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందన్నారు. సిరిసిల్ల, ములుగు జిల్లాలు హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయని.. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టామని... జిల్లాలో 510 పాఠశాలల స్థితిగతులపై సమీక్షించినట్టు పేర్కొన్నారు. మూడు దశల్లో జిల్లాలోని అన్ని పాఠశాలల ఆధునీకరణ జరుగనుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 21, 2022, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details