తెలంగాణ

telangana

ETV Bharat / state

మసీదులు తవ్వుదాం.. పేపర్లు లీక్ చేద్దాం అనేటోళ్లకు ఓటేయకండి: కేటీఆర్ - సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు

KTR Sircilla Tour Today : సమాజానికి కీడు చేసేవారి కన్నా మంచి చేసే వారిని గెలిపిస్తే త్వరితగతిన అభివృద్ధి చెందుతామని మంత్రి కేటీఆర్ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. మసీదులు తవ్వుదాం, సమాధులు తవ్వుదాం, పేపర్ లీక్ చేద్దాం అనేటోళ్లకు ఓటేయవద్దని హితవు పలికారు. చీర్లవంచలో త్వరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో 350 ఎకరాల్లో ఆక్వా హబ్ ప్రారంభిస్తామని తెలిపారు.

KTR
KTR

By

Published : Apr 10, 2023, 2:10 PM IST

KTR Sircilla Tour Today : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో సబ్ స్టేషన్ ప్రారంభించిన కేటీఆర్‌.. అంబేడ్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడిన మంత్రి కేటీఆర్ పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

350 ఎకరాల్లో ఆక్వా హబ్ ప్రారంభిస్తాం : సమాజానికి కీడు చేసేవారి కన్నా మంచి చేసే వారిని గెలిపిస్తే త్వరితగతిన అభివృద్ధి చెందుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. మసీదులు తవ్వుదాం, సమాధులు తవ్వుదాం, పేపర్ లీక్ చేద్దాం అనేటోళ్లకు ఓటేయవద్దని హితవు పలికారు. స్థానిక ప్రజలకు ఎలాంటి అవసరాలున్న అధికారులు, నాయకులను కలవాలని సూచించారు. వారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. చీర్లవంచలో త్వరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో 350 ఎకరాల్లో ఆక్వా హబ్ ప్రారంభిస్తామని తెలిపారు. చీర్లవంచలో భూములు కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే మంగళవారం జిల్లా కలెక్టర్​ను​ కలవండని సూచించారు.

అభివృద్ధిని కాంక్షించే వాళ్లను గెలిపించుకుందాం : గ్రామంలో ఏమైనా ప్రభుత్వ భూమి మిగిలి ఉంటే సొసైటీ బిల్డింగ్ నిర్మిద్దామన్న కేటీఆర్.. దళిత బంధులో భాగంగా నియోజకవర్గానికి వంద యూనిట్లు వస్తే చిన్న గ్రామాల్లోని అర్హులకు పంచి పెట్టామన్నారు. పక్కనే ఉన్న గండి లచ్చక్కపేటలో ఇద్దరు లబ్ధిదారులు కలిసి పౌల్ట్రీ ఫారం పెట్టుకున్నారని పేర్కొన్నారు. చీర్లవంచలో 750 గడపలుంటే 830 మందికి పెన్షన్లు వస్తున్నాయన్న మంత్రి కేటీఆర్.. 18 ఏళ్లు పైబడిన వాళ్లు ఉండి ప్యాకేజీ రాకపోతే ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎవరూ ఇబ్బంది పడొద్దన్న ఆయన.. అభివృద్ధిని కాంక్షించే వినోద్ కుమార్ లాంటి వాళ్లను గెలిపించుకుంటే మంచిదని సూచించారు.

'చింతల్‌ ఠాణా వద్ద 300 ఎకరాల్లో ఆక్వా హబ్‌ ఏర్పాటు చేస్తాం. ఆక్వా హబ్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తాం. నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తాం. పెద్దమ్మగుడి వద్ద ముదిరాజ్‌లకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తాం. మధ్యమానేరు ప్రాజెక్టు మనం ప్రారంభించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో ఉన్న అవాంతరాలన్నీ తొలగించి ప్రాజెక్టు పూర్తి చేశాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టు వాటర్ హబ్​గా మారిందంటే ఈ గ్రామాల ప్రజల త్యాగాలు ఉన్నాయి. అందులో ఈ ప్రాంతాల వారికి తగిన ప్రాధాన్యత ఇస్తాం. దీని నిర్మాణం చేపడితే పలు గ్రామాల వాసులు వలస పోయినట్లు చెబుతున్నారు. కానీ నీళ్లు వచ్చిన తర్వాత వాళ్లందరూ తిరిగి వస్తున్నారు.'-కేటీఆర్‌, ఐటీ మంత్రి

మసీదులు తవ్వుదాం.. పేపర్ లీక్ చేద్దాం అనేటోళ్లకు ఓటేయకండి : కేటీఆర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details