తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'పార్టీ పేరు మాత్రమే మారింది.. డీఎన్​ఏ అలానే ఉంది'

Sirisilla Constituency BRS Assembly Plenary Program: రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడ జరిగిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్​ పార్టీలకు మంత్రి కేటీఆర్​ సవాల్​ విసిరారు. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజక వర్గ బీఆర్​ఎస్​ ప్రతినిధుల సభా ప్లీనరీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు.

ktr
ktr

By

Published : Apr 25, 2023, 4:53 PM IST

Sirisilla Constituency BRS Assembly Plenary Program: టీఆర్​ఎస్​ నుంచి బీఆర్​ఎస్​గా పార్టీకి పేరు మాత్రమే మారిందని.. పార్టీ డీఎన్​ఏ అలానే ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజక వర్గ బీఆర్​ఎస్​ ప్రతినిధుల సభా ప్లీనరీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ నెల 27తో టీఆర్​ఎస్​ పార్టీ ఆవిర్భవించి 22 ఏళ్లు పూర్తి అయ్యి.. 23వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతుందని.. నాటి నుంచి నేటి వరకు టీఆర్​ఎస్​ నుంచి బీఆర్​ఎస్​ పార్టీగా ఎలా ఎదిగిందో మంత్రి కేటీఆర్​ వివరించారు. నాటి తెలంగాణ సమాజం తాగు, సాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని.. మన పిల్లలు కొలువుల కోసం ప్రాణాలను త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాని నేడు ఆ సమస్యలు నుంచి బయటపడి దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నామని చెప్పారు.

BRS Assembly Plenary Program: నాటి పాలకులు కేవలం తెలంగాణను ఓట్ల కోసమే వాడుకున్నారు తప్పా.. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిపెట్టాలని ఏనాడు అనుకోలేదని కేటీఆర్​ స్పష్టం చేశారు. నాడు కేసీఆర్​ తాను తెలంగాణను తీసుకురాకపోతే ప్రజలు తనను రాళ్లతో కొట్టి చంపండి అని.. ముందుండి రాష్ట్రాన్ని తీసుకువచ్చారన్నారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రూ. 50 లక్షల రోడ్డు కోసం గత ప్రభుత్వం చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. చులకనగా చూశారని కేటీఆర్​ బాధపడ్డారు. కాని నేడు తెలంగాణ సిద్ధించిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసి.. రోడ్లను వేయించామని ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశంలో తెలంగాణ జనాభా 2.50 శాతం.. మొన్న జాతీయ అవార్డులు ప్రకటిస్తే 30 శాతం అవార్డులు గెలుచుకుందని.. దీంతో తెలంగాణ సత్తా యావత్​ దేశానికి తెలిసిందని మంత్రి కేటీఆర్​ వివరించారు.

గోల్డెన్​ తెలంగాణను భారత్​కు పరిచయం చేశాము: రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడ జరిగిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్​ పార్టీకి సవాల్​ విసిరారు. గోల్డెన్​ తెలంగాణను భారతదేశానికి పరిచయం చేయడానికే బీఆర్​ఎస్​గా పేరు మార్చుకున్నామని వివరణ ఇచ్చారు. తెలంగాణలో రైతులు బాగుపడినట్లే.. దేశంలోని రైతులు బాగుపడేందుకే బీఆర్​ఎస్​ ఏర్పాటు చేశామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.. కాని ఏమైంది దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని విమర్శించారు.

"పార్టీకి మారింది పేరు మాత్రమే... డీఎన్‌ఏ కాదు. మోదీ చేసిన గోల్‌మాల్‌ను దేశమంతటికీ వివరించాలి. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. అని మహారాష్ట్ర రైతులు గర్జిస్తున్నారు. మహారాష్ట్రలో అంటుకున్న అగ్గి దేశం మొత్తం అంటుకుంటుంది. వ్యవసాయంపై రూ. 4.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే రోజు త్వరలోనే వస్తుంది. బ్రెయిన్‌ బంటి.. రోజుకో పార్టీ మారే చంటితో మనకు పోటీ లేదు." - కేటీఆర్​, మంత్రి

పార్టీ పేరు మాత్రమే మారింది.. డీఎన్​ఏ అలానే ఉంది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details