అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన పల్లెప్రగతి పంచాయతీరాజ్ సమ్మేళనంలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
'సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందేలా పనిచేయండి' - 'సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందేలా పనిచేయండి'
సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో పల్లె ప్రగతి పంచాయతీరాజ్ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సమావేశంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
ఎంతో మేధోమధనం చేసాకే సీఎం కేసీఆర్... కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చారని తెలిపారు. గ్రామీణ జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం చేపట్టారన్నారు. పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలని, ప్రతీ గ్రామానికి వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, కంపోస్టు షెడ్ల నిర్మాణాలు తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని, పనిచేయని ప్రజాప్రతినిధులపై, అధికారులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.