రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఇసుక బట్టీల్లో పని చేసే వలస కార్మికులు రెండ్రోజుల క్రితం ఒడిశాకు పయనమయ్యారు. కాలినడకన ఊరి బాట పట్టిన వీరికి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో గ్రామ సర్పంచ్ భోజన వసతి కల్పించారు.
తిండి లేకే తిరిగి వెళ్తున్నాం!
ఇసుక బట్టీల్లో పనిచేసే వలస కూలీలు.. లాక్డౌన్తో ఉపాధి లేక ఊరి బాట పట్టారు. రవాణా సదుపాయం లేక కాలినడకనే స్వస్థలాలకు బయలుదేరారు.
Breaking News
రెండ్రోజుల పాటు అక్కడే బస చేసిన కూలీలు తిరిగి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ వారికి భోజన సౌకర్యం కల్పించారు. రాత్రి అక్కడే బస చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఇసుక బట్టీల యజమానులు తమకు భోజన వసతి కల్పించకపోవడం వల్లే సొంతూళ్లకు బయలుదేరుతున్నామని కూలీలు వాపోయారు.