రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ గ్రామం వద్ద నిర్మించిన మధ్య మానేరు ప్రాజెక్టులోకి భారీ ఎత్తున కాళేశ్వరం, గోదావరి జలాలు చేరుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలోకి 19 టీఎంసీల నీరు చేరడం వల్ల బ్యాక్ వాటర్ మానేరు వాగు ద్వారా ఎగువకు వస్తోంది. ఇది సిరిసిల్ల పట్టణ శివారులోకి వచ్చింది. ఈ నీటిని చూసేందుకు పట్టణ ప్రజలతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
సిరిసిల్ల శివారులోకి మధ్య మానేరు నీరు - సిరిసిల్ల శివారులోకి మధ్య మానేరు నీరు
మధ్య మానేరు ప్రాజెక్టులోకి కాళేశ్వరం, గోదావరి జలాలు చేరుతున్నాయి. బ్యాక్ వాటర్ ఎగువకు వస్తూ సిరిసిల్ల పట్టణ శివారులోకి వచ్చింది.

సిరిసిల్ల శివారులోకి మధ్య మానేరు నీరు