తెలంగాణ

telangana

ETV Bharat / state

జలకళ సంతరించుకున్న మధ్యమానేరు జలాశయం - మధ్యమానేరు జలాశయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయం నిండుకుండలా మారిపోయింది. గతంలో మట్టికొట్టుకుపోయిన ప్రాజెక్టు సీఎం చొరవతో ప్రస్తుతం జలకళ సంతరించుకుంది.

జలకళ సంతరించుకున్న మధ్యమానేరు జలాశయం

By

Published : Aug 25, 2019, 12:32 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా మన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు జలాశయం నీటితో కళకళలాడుతోంది. 2016 సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షానికి మధ్యమానేరు మట్టి కట్టకొట్టుకు పోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. గుత్తేదారులను మార్చి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం వల్ల లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపు నుంచి ఎల్లంపల్లి జలాలు వడివడిగా వచ్చి జలాశయంలోకి చేరుతున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కుల చొప్పున జలాశయానికి చేరుకుంటుంది. మధ్యమానేరు పూర్తి సామర్థ్యం 25 టీఎంసీలు కాగా... ప్రాజెక్టులో ప్రస్తుతం 10టీఎంసీల నీరు నిల్వ ఉంది.

జలకళ సంతరించుకున్న మధ్యమానేరు జలాశయం

ABOUT THE AUTHOR

...view details