తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2022, 2:35 PM IST

ETV Bharat / state

వేములవాడలో ఉద్రిక్తత, మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

mid manair dam residents agitationరాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

mid manair dam residents agitation in vemulawada
వేములవాడలో ఉద్రిక్తత, మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

mid manair dam residents agitation తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నంది కమాన్‌ వద్ద మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో మధ్యమానేరు ముంపు బాధితులు మహాధర్న చేపట్టారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల నుంచి ముంపు బాధితులు వేములవాడకు వెళ్లేందుకు యత్నించగా నంది కమాన్‌ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ధర్నాకు దిగారు.

ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మంది నిర్వాసితులు పోలీసుల వాహనాలకు అడ్డుగా కూర్చున్నారు. నిర్వాసితులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో డీఎస్పీలు నాగేంద్రాచారి, చంద్రశేఖర్‌, పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి తమకు పూర్తి స్థాయి పరిహారం అందలేదని, సీఎం ఇచ్చిన హామీ మేరకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదనే డిమాండ్లతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు.

పోలీసుల దౌర్జన్యం దుర్మార్గం... ''మధ్య మానేరు నిర్వాసితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. పరిహారం కోసం ధర్నా చేస్తున్న మిడ్ మానేరు నిర్వాసితులపై పోలీసుల దౌర్జన్యం దుర్మార్గం. ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నిర్వాసితుల అరెస్టును ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన నిర్వాసితులను తక్షణమే విడుదల చేయాలి. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి. నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది'' అని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వారి డిమాండ్లన్నీ న్యాయమైనవే... ''మధ్య మానేరు ముంపు బాధితులను పరామర్శిస్తే అరెస్టు చేస్తారా?మహిళలు అని కూడా చూడకుండా అరెస్టు చేయడమేంటి? మధ్య మానేరు ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన వారిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. వారి డిమాండ్లన్నీ న్యాయమైనవే'' అని బండి సంజయ్‌ ట్వీట్ చేశారు.

ఇవీ చూడండి:

కాంగ్రెస్​కు డాక్టర్​ బదులు కాంపౌండర్ల వైద్యం, ఏ క్షణమైనా పార్టీ శిథిలం

హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం, రఫేల్​ స్కామ్​పై విచారణకు నో

ABOUT THE AUTHOR

...view details