తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు వేములవాడలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం - meeting on covid situations in rajanna sircilla district

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం వేములవాడలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు జడ్పీ ఛైర్​పర్సన్ తెలిపారు.

isolation centre for covid-19 patients to start at vemulawada
రేపు వేములవాడలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం

By

Published : Aug 13, 2020, 6:40 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ ఛైర్​పర్సన్ అరుణ అధ్యక్షతన కొవిడ్​పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం వేములవాడలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అరుణ తెలిపారు. మంత్రి కేటీఆర్ పంపించిన రూ.రెండు కోట్ల చెక్కును డీఎంహెచ్ అధికారి, ఆసుపత్రి సూపరింటెండెండ్​కు అందజేశారు.

కొవిడ్ నియంత్రణ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లాలోని పీహెచ్​సీల్లో అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్లు అరుణ తెలిపారు. కొవిడ్​ కట్టడి చర్యలను మరింత కఠినతరం చేస్తామని.. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details