తెలంగాణ

telangana

ETV Bharat / state

Medical and Health Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైద్యారోగ్య దినోత్సవం... పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు - కేటీఆర్ తాజా వార్తలు

Medical and Health Day in Telangana 2023 : వైద్యారంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా... వైద్యారోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. 9ఏళ్ల పాలనలో వైద్యరంగంలో తెలంగాణలో వచ్చిన మార్పులు... ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని వివరించారు..

Medical and Health Day
Medical and Health Day

By

Published : Jun 14, 2023, 9:07 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైద్యారోగ్య దినోత్సవం... పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

Telangana Medical and Health Day in Decade Celebrations :రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా... వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీహెచ్‌సీ స్థాయి నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో వేడుకలు జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఖైరతాబాద్‌లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నాగేందర్‌ గర్భిణులకు అందజేశారు. సనత్‌నగర్‌లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌... తెలంగాణ మెడికల్ హబ్‌గా మారిందని తెలిపారు.

Health Day Celebrations In Telangana : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో వైద్యారోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే రమేష్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది వైద్యసేవలపై అవగాహన కల్పించారు. ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియాలజీ ల్యాబ్‌, కిమోథెరపీ వార్డు, డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు.

Telangana Medical and Health Day Celebrations : నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా కేసీఆర్‌ కిట్‌లు పంపిణీ చేశారు. ఒకనాడు ఆరోగ్యసూచికలో 24వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు... కేరళ తర్వాతి స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లలో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేశారు. కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి గంగుల కమలాకర్ గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్‌లు పంపిణీ చేశారు. గర్భిణీలు బలవర్ధకమైన ఆహారం తీసుకొంటే ఆరోగ్యమైన శిశువులకు జన్మనిస్తారనే దూరదృష్టితోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూట్రిషన్ కిట్‌ రూపకల్పన చేశారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించక ముందు వైద్యారోగ్యశాఖ పరిస్థితి దయనీయంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖను తీర్చిదిద్దడమే కాకుండా ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి చేయించుకుంటే ప్రోత్సహకాలు అందించడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఆరోగ్య తెలంగాణనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఆరోగ్య తెలంగాణనే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్‌లో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా.. ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details