వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలవనరుల్లో వరద పోటెత్తుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగులో వరద నీరు ఉద్ధృతంగా పారుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల మానేరు నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మానేరు, నక్కవాగు - ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మనేరు, నక్కవాగు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగులో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ తరుణంలో మానేరు, నక్క వాగు ప్రాజెక్టు పరవళ్లను చూసేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న మనేరు, నక్కవాగు
నర్మల ప్రాజెక్టు, ఎగువ మానేరు మత్తడి దూకినట్లైతే మానేరు వాగు మరింత పరవళ్లు తొక్కే అవకాశం ఉంది. తంగళ్లపల్లి మండలంలోని నక్కవాగు ప్రాజెక్టు సైతం పరవళ్లు తొక్కుతోంది. మానేరు, నక్క వాగు ప్రాజెక్టు పరవళ్లను చూసేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చూడండి :భారీ వర్షం... ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం