రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. మల్లారం రోడ్డులోని వాగు పొంగి పొర్లడం వల్ల ప్రధానదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రవాహానికి రెండు వైపులా బారికేడ్లు, కట్టెలతో ప్రయాణికులు రోడ్డు దాటకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ధర్మగుండంలో నిండుగా నీరు...