Making Parties Flags in Rajanna Sircilla District జెండా ఎగిరేదెక్కడైనా తయారీ ఇక్కడే Making Parties Flags in Rajanna Sircilla District : రాజన్న సిరిసిల్ల జిల్లా జెండాల తయారీకి ప్రసిద్ధి. చుట్టు పక్కల రాష్ట్రాల్లో.. ఏ పార్టీ జెండా (Parties Flags) ఎగరాలన్నా ఇక్కడ తయారు చేయాల్సిందే. తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తుండడంతో పార్టీల నుంచి ఆర్డర్లు ఊపందుకున్నాయి. సిరిసిల్లలో 15 మంది వరకు తయారీదారులు ఉన్నారు. రోజుకు 50,000 నుంచి 75,000 వరకు జెండాలు తయారు చేసే సామర్థ్యం ఇక్కడి తయారీదారులకు ఉంది. ఒక్కొక్కరి వద్ద 100 నుంచి 200 మంది కార్మికులు పనిచేస్తుండగా.. పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో.. షెడ్యూల్ రాకపోయినా ముందస్తుగా ఆర్డర్లు వస్తుండటంతో తయారీదారులు.. తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఈ జాతీయ జెండాలు పర్యావరణహితం!
రాష్ట్రంలో ఒక్కో ప్రధాన పార్టీ నుంచి దాదాపు 15 లక్షల వరకు జెండాలు, కండువాలు రూపొందించేలా.. ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చాయంటున్న వారు.. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం (Election) తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 5 లక్షల జెండాలు ఉత్పత్తి చేయబోతున్నామని చెప్పారు. మరింత మంది ఆర్డర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తయారు చేసేందుకు కావాల్సిన సిబ్బంది అందుబాటులో లేరని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Officials Removed Flags and Banners of Political Parties Telangana : ఎలక్షన్ కోడ్ వచ్చింది.. బ్యానర్లు, ప్రకటనల తొలగింపు మొదలైంది
"ఒక్క తెలంగాణ మాత్రమే కాకుండా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ లేకపోయినా ముందస్తుగా ఆర్డర్లు ఇస్తున్నారు. తెలంగాణలోని ప్రధాన పార్టీల నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల చొప్పున జెండాలు, కండువాలు రూపొందించేలా ఆర్డర్లు వచ్చాయి. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 5 లక్షల జెండాలు ఉత్పత్తి చేయబోతున్నాం. మరికొంత మంది ఆర్డర్లు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. అయినా మేము స్వీకరించలేని పరిస్థితి ఉంది." - తయారీదారులు
Telangana Assembly Elections 2023 : గతంలో బీడీల తయారీతో తక్కువ ఆదాయం రావడంతో.. ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని కార్మికులు చెబుతున్నారు. జెండాల తయారీతో కొద్దిరోజులు మాత్రమే ఉపాధి లభిస్తుందంటున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగే కంటే వేర్వేరుగా జరిగితేనే పని దొరుకుతుందని అంటున్నారు. గతంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సిరిసిల్ల వ్యాపారులకు.. కోటి జాతీయ జెండాల తయారీకి ఆర్డర్లు వచ్చాయి. తాజాగా ఎన్నికల నగారా మోగడంతో మరో అవకాశం లభించిందని.. వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం వచ్చిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
"గతంలో బీడీల తయారీతో రోజుకు రూ.100 నుంచి రూ.150కి మించి ఆదాయం లభించక పోవడంతో అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. జెండాల తయారీతో కొద్ది రోజులు మాత్రమే ఉపాధి లభిస్తుంది. ఒకేసారి ఎన్నికలు జరిగే కంటే వేర్వేరుగా జరిగితేనే పని దొరుకుతుంది." - కార్మికులు
పింగళిపై అభిమానంతో జాతీయ జెండాలు తయారు చేస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు
'హర్ ఘర్ మే తిరంగా'.. చేనేత కార్మికులకు వరంగా..!