గాంధీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ బాలుర పాఠశాలలో సైకత శిల్పి, సూక్ష్మ కళాకారుడైన ఉపాధ్యాయుడు ఓ చోలేశ్వర చారీ మహాత్మాగాంధీ సైకత శిల్పాన్ని తయారు చేశారు.
ఆకట్టుకుంటున్న ఇసుక మీద మహాత్మా సైకత శిల్పం - Gandhi Jayanti Latest News
సిరిసిల్ల జిల్లా వేములవాడలో సైకత శిల్పి, సూక్ష్మ కళాకారుడైన ఉపాధ్యాయుడు ఓ చోలేశ్వర చారీ మహాత్మాగాంధీ సైకత శిల్పాన్ని తయారు చేశారు. ఆయన ఇప్పటివరకు 800 సూక్ష్మ శిల్పాలు చేశారు.
ఆకట్టుకుంటున్న ఇసుక మీద మహాత్మా సైకత శిల్పం
పాఠశాలలో ఆర్ట్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న చోలేశ్వర చారీ ఇప్పటివరకు 800 సూక్ష్మ శిల్పాలు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్, రాయల్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సంపాదించారు. విద్యార్థులకు జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చరిత్ర తెలిసేందుకు సైకత శిల్పం తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రిన్సిపల్ ఏ.రాజేష్ ఉపాధ్యాయ బృందం అభినందించారు
ఇదీ చూడండి:పాక్ దుశ్చర్యకు మరో ఇద్దరు భారత జవాన్లు బలి