తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు - గాంధీ జయంతి వేడుకలు

గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల కేంద్రంలో 5కే, 2కే రన్ నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ గొప్పతనాన్ని పలువురు నాయకులు కొనియాడారు.

mahatma Gandhi birthday celebrations in siricilla
mahatma Gandhi birthday celebrations in siricilla

By

Published : Oct 2, 2020, 11:31 AM IST

అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛాస్వాతంత్య్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ కొనియాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్లలో జిల్లా యువజన క్రీడలు, ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రగుడు నుంచి గాంధీ విగ్రహం వరకు 5 కే రన్ నిర్వహించారు.

అనంతరం మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్ నిర్వహించి, స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ జిందం కళ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న చీరలు

ABOUT THE AUTHOR

...view details