ప్రపంపచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రజ్వరిల్లుతోందని మహరాష్ట్ర మాజీ గవర్నర్ అన్నారు. దేశంలో భాజపాకు ఎదురులేదన్నారు. భవిష్యత్తు మొత్తం భాజపాదేనని చెప్పటానికి దేశంలో ఈ మధ్య జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన పలు శుభకార్యాలకు హాజరయ్యారు.
భవిష్యత్ అంతా భాజపాదే హవా: సీహెచ్ విద్యాసాగర్‌రావు - bjp leader vidyasagar about ghmc results
రాజన్న సిరిసిల్లా జిల్లాలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భాజపా శ్రేణుల శ్రమకు ఫలితం కనపడిందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా జిల్లా భాజపా నాయకులు, కార్యకర్తలు విద్యాసాగర్‌రావుకు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు, కార్యకర్తల కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యకర్తల కృషి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. కొత్త చట్టాలపై గ్రామస్థాయిలో రైతుల్లో చర్చజరగితే వారికి అర్థమవుతుందని విద్యాసాగర్ సలహా ఇచ్చారు.
ఇదీ చూడండి:అప్పుడే పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే అనంత లోకాలకు..