రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా ఘనంగా మహాలింగార్చన నిర్వహించారు. ఆలయంలో తెల్లవారుజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేపట్టారు.
వేములవాడలో ఘనంగా మహాలింగార్చన - Vemulavada rajarajeshwara temple news
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా ఘనంగా మహాలింగార్చన నిర్వహించారు.
వేములవాడలో ఘనంగా మహాలింగార్చన
సాయంత్రం శ్రీ స్వామివారి కల్యాణ మండపంలో 366 మట్టితో తయారు చేసిన చిరు లింగాలను లింగాకారంలో పేర్చి జ్యోతులు వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.