రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. సిరిసిల్లలో నిబంధనల అమలు తీరును ఎస్పీ బైక్పై తిరుగుతూ పర్యవేక్షించారు. 11 ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా బయటకి వచ్చిన 71 వాహనాలపై ఇవాళ కేసులు నమోదు చేశామన్నారు.
బైక్పై తిరుగుతూ లాక్డౌన్ అమలును పరిశీలించిన ఎస్పీ
సిరిసిల్లలో ఏడో రోజు లాక్డౌన్ ప్రశాంతంగా అమలవుతోంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలకు జరిమానా విధిస్తున్నారు.
బైక్పై తిరుగుతూ లాక్డౌన్ను పరిశీలించిన ఎస్పీ
అనవసరంగా బయట తిరుగుతున్న వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెట్టామని తెలిపారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో