రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిని పోలీసులు ప్రత్యేక వాహనాల్లో ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అనవసరంగా రోడ్లపై, బయట తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై, వీధుల్లో తిరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నిబంధనలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆకతాయిలను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.
Lockdown: రోడ్డెక్కితే ఐసోలేషన్ కేంద్రానికే..!
ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బయట తిరిగే వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
lockdown: నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై పోలీసుల చర్యలు
ఐసోలేషన్ కేంద్రాల్లో వారికి పరీక్షలు నిర్వహించి కరోనా నిర్ధరణ అయితే చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా నెగెటివ్ వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు మొత్తంగా 4510 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 372 వాహనాలను సీజ్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Investigation : రాష్ట్రంలో వ్యాక్సిన్ల వృథాపై విజిలెన్స్ విచారణ