తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2021, 5:31 PM IST

Updated : Apr 6, 2021, 6:29 PM IST

ETV Bharat / state

భూమిలో పాతిపెట్టిన టిఫిన్ బాక్స్‌.. తెరిస్తే ఏముందంటే..

రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో భూమిలో టిఫిన్ బాక్స్‌ కనిపించడం వల్ల స్థానికులు, పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జేసీబీని రప్పించారు. రహదారిపై రాకపోకలు ఆపేశారు. బాంబు డిస్పోజల్‌ బృందాన్ని పిలిపించారు. చివరికి ఆ టిఫిన్ బాక్స్‌ తెరిచి చూశారు. దానిలో ఏముందంటే...

tiffin box news, Marimadla,  Rajanna Sircilla district
రాజన్న సిరిసిల్ల, టిఫిన్ బాక్స్, మరిమడ్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం వద్ద భూమిలో టిఫిన్ బాక్స్‌ లభించటం కలకలం సృష్టించింది. మరిమడ్ల- మానాల రహదారి మధ్య భూమిలో టిఫిన్‌ బాక్స్‌ ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. బాంబు డిస్పోజల్‌ బృందాన్ని రప్పించారు. జేసీబీ సహాయంతో... తవ్వకాలు జరిపి టిఫిన్‌ బాక్సును వెలికి తీశారు.

అనంతరం టిఫిన్‌ బాక్సులో పరిశీలించగా నల్లకోడి, నిమ్మకాయలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఇటీవల సరిహద్దు రాష్ట్రాల్లో మావోయిస్టుల సంచారం ఉండటంతో... అప్రమత్తమయ్యామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:'ధాన్యం కొన్న పదిరోజుల్లో డబ్బు ఖాతాలో జమ చేస్తాం'

Last Updated : Apr 6, 2021, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details