ఇళ్లలోకి మురుగునీరు వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. స్థానికుల ధర్నాతో రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా సమస్య ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మురుగునీరు ఇళ్లలోకి వస్తోందంటూ స్థానికుల ఆందోళన
మురుగునీరు ఇళ్లలోకి వస్తోందని స్థానికులు ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా సమస్య ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
అధికారులతో వాదిస్తున్న స్థానికులు
పట్టణంలోని కొత్త చెరువు వద్ద నుంచి మురుగునీరు ఇళ్లలోకి వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ ఛైర్మన్ జింద కళ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.