తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాకు.. రూ.2 లక్షల బీమా మంజూరు చేయాలి' - సిరిసిల్ల జిల్లాలో హమాలీ కార్మికుల ధర్నా

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులు.. రూ.2 లక్షల బీమాతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు.

labour protest at rajanna siricilla
సిరిసిల్ల జిల్లాలో హమాలీ కార్మికుల ధర్నా

By

Published : Dec 28, 2019, 3:32 PM IST

సిరిసిల్ల జిల్లాలో హమాలీ కార్మికుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగారు. తమకు రూ.2 లక్షల బీమా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.

జిల్లాలోని 189 ఐకేపీ కేంద్రాల్లో సుమారు 5వేల మంది హమాలీ కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, అందరికీ కూలీ ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details