Sirisilla sarees: అమెరికా చేనేత నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జఫ్ ఉమ్మడి కరీంనగర్‌లోని సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నైపుణ్యం వంటి వాటిపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా తన అధ్యయనంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల చేనేత చీరలను ఆసక్తిగా తిలకించిన ఆమె.. వాటిని కట్టుకొని మురిసిపోయారు.
చేనేత నైపుణ్య నిపుణురాలైన ఆమె అక్కడ నేతన్నలు చేనేత కళ నుంచి మర మగ్గాలవైపు మళ్లిన చరిత్రను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో మగ్గాలపై నేస్తున్న బట్టలను, వారి నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి చేనేత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.