KTR: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం.. చిన్నారి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ - KTR visit to a child
![KTR: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం.. చిన్నారి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ KTR visit to a child](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13536847-570-13536847-1635924768849.jpg)
12:50 November 03
నిలోఫర్‌లో చిన్నారిని, తల్లిదండ్రులను పరామర్శించిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని (Minister KTR) భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబసభ్యులను కేటీఆర్(Minister KTR).. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని కేటీఆర్(Minister KTR) ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు.
ఇదీ చదవండి:Etela Rajender Speech: 'కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయమిది'