KTR Tweet on His Marriage Anniversary : తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వివాహ వార్షికోత్సం సందర్భంగా తన భార్య శైలిమకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాదితో వారు 20వ వివాహ వసంతంలోకి అడుగు పెట్టారు. కాగా వీరి వివాహం 2003లో జరిగింది. వీరికి కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య ఉన్నారు.
20వ వివాహ వసంతంలోకి అడుగు పెట్టిన కేటీఆర్ దంపతులు - ఎక్స్ వేదికగా విషెస్ - కేటీఆర్ తాజా ట్వీట్
KTR Tweet on His Marriage Anniversary : మాజీ మంత్రి కేటీఆర్ దంపతులు 20వ వివాహ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా సతీమణి శైలిమకు విష్ చేశారు.
Published : Dec 18, 2023, 8:01 PM IST
|Updated : Dec 18, 2023, 8:13 PM IST
‘రెండు దశాబ్దాల పాటు కొండంత అండగా నిలిచినందుకు, నాకు ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు, నా జీవితంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ‘మనం ఇలాగే కలకాలం కలిసుండాలి’ అంటూ పోస్టు చేశారు. ఇందులో తమ వివాహం నాటి ఫొటోను, భార్యాపిల్లలో దిగిన మరో ఫొటోను కూడా జత చేశారు.
మరోవైపు కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ కూడా తల్లిదండ్రులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మానాన్నలకు 20వ పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అని ఇంగ్లీష్‌లో పోస్టు పెట్టారు. ‘మీరిద్దరూ నా తల్లిదండ్రులు అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని పేర్కొన్నారు. ‘నేను మిమ్మల్ని చాలాచాలా ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు తాను తన గ్రాడ్యుయేషన్ నాటి ఫోటోతో పాటు మరో ఇమేజ్ను జత చేశారు.
TAGGED:
ktr latest tweets