ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రపంచమంతా కరోనాతో గందరగోళంలో ఉందన్నారు. అమెరికా మొదలుకుని భారతదేశం వరకు అంతా తల్లిడిల్లుతోందని పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్ర ఆదాయం 95 శాతం తగ్గిందని తెలిపారు. ఇంత సంక్షోభంలోనూ రైతులకు రూ.1,200 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు.
95 శాతం ఆదాయం తగ్గింది: కేటీఆర్ - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు
ప్రపంచమంతా కరోనాతో గందరగోళంలో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్ర ఆదాయం 95 శాతం తగ్గిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో మంత్రి పర్యటించారు.
95 శాతం ఆదాయం తగ్గింది: కేటీఆర్
వానాకాలం సాగు కోసం నిధులు అందజేశామని తెలిపారు. ఎరువులు, విత్తనాలు అందించేందుకు సీఎం ఆర్థిక చేయూత అందించారని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కష్టాలు తీర్చామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. ఎరువులు, విత్తనాలు ముందస్తుగా తీసుకొచ్చి రైతులు వరుసల్లో నిలబడకుండా చేశామన్నారు.