తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్ల‌ను ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి: కేటీఆర్ - Ktr Review on Siricilla district

ktr-review-with-siricilla-dist-officials-on-development
సిరిసిల్ల‌ను ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి: కేటీఆర్

By

Published : Sep 2, 2020, 4:18 PM IST

Updated : Sep 2, 2020, 5:31 PM IST

16:14 September 02

సిరిసిల్ల‌ను ఆద‌ర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి: కేటీఆర్

సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పనులు పరిగెత్తించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వ సేవలుండాలన్న మంత్రి.. ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని యంత్రాంగానికి సూచించారు.

కొవిడ్ బాధితులకు అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్న మంత్రి.. అవసరమైన కొవిడ్ ఔషధాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. క్లస్టర్ అస్పత్రులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండలింగంపల్లి పీహెచ్​సీలను వేగంగా నిర్మించాలని మంత్రి ఆదేశించారు. విలీన గ్రామాల్లోనూ అభివృద్ది కార్యక్రమాలు వేగంగా కొనసాగాలన్నారు. సిరిసిల్ల జిల్లాలో రైతు వేదికల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలో చెరువులన్నీ నిండాయని.. మంచి పంటలు పండే అవకాశం ఉందన్నారు. 154 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పనుల తీరుపైనా ఆరా తీశారు.

ఇదీ చూడండి :ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

Last Updated : Sep 2, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details