తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR on Independence Day Celebration : 'మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి'

KTR on Independence Day Celebration : మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ (Swachh Survekshan) అవార్డుల్లో రాష్ట్రానిదే సింహభాగమని హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

KTR Sirisilla Tour
KTR on Independence Day Celebration

By

Published : Aug 15, 2023, 4:19 PM IST

Updated : Aug 15, 2023, 7:06 PM IST

KTR on Independence Day Celebration 'మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి'

KTR on Independence Day Celebration : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఆవరణంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడిన కేటీఆర్‌.. స్వతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రజలందరూ జరుపుకోవాలని సూచించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని దేశం స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అని కేటీఆర్‌ గుర్తు చేశారు.

CM KCR Speech at Golconda Fort : 'తెలంగాణ ప్రగతి చూసి యావత్‌ దేశం ఆశ్చర్యపడుతోంది'

Independence Day Celebrations in Telangana : మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ (Swachh Survekshan) అవార్డుల్లో రాష్ట్రానిదే సింహభాగమని పేర్కొన్నారు. మన ఊరు- మన బడి (Manaooru manabadi)కార్యక్రమంలో రాష్ట్రంలో పాఠశాలలను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలోనే 172 కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించామన్నామని మంత్రి తెలిపారు. ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు ధగధగలాడుతున్నాయని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

'3Dతో అన్ని కలలు సాకారం.. 2047లో జెండా ఎగిరే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్​'

KTR Independence Day Celebration Speech :అనంతరం తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు. సారంపల్లిలో ఈరోజు నుంచే తన ఎన్నికల ప్రచారం మొదలైందని పేర్కొన్నారు. నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను ప్రస్తవించారు. అలాగే రాష్ట్రంలో రైతు రుణమాఫీ ద్వారా కేవలం సోమవారం ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు.. రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ (Rythu Runamafi) చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.

Today KTR Siricilla Tour :నియోజక వర్గంలోకి గోదావరి నీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణాను తీర్చిదిద్దుతున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై కేటీఆర్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రధాన సమస్యలు గుర్తించి రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చుదిద్దుతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

"అభివృద్ధిలో పోటీపడాలి తప్ప, కులం పేరిట, మతం పేరిట చిచ్చులు పెట్టకూడదు. నన్ను నాలుగు సార్లు గెలిపించారు మళ్లీ గెలిపిస్తే మీ తమ్ముడిగా, అన్నగా అండగా ఉండి మంచి పనులు చేస్తా. భవిష్యత్తులో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి, సంక్షేమంతో పాటు, మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తాం. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తాం.- కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి"- కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి

Independence Day celebrations at Ramoji Film City : రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Revanth Reddy Independence Day Speech : 'తిరగబడదాం.. తరిమికొడదాం.. కుటుంబ పాలనను వెళ్లగొడదాం'

Independence Day Celebrations in BJP Office : 'కేసీఆర్​ కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే.. తెలంగాణ అధోగతి పాలు'

Last Updated : Aug 15, 2023, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details