ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. కరోనాపై పోరుకు రాబోయే రెండు వారాలు చాలా కీలకమని, లాక్డౌన్ నియమాలను ప్రజలందరూ పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
రాబోయే రెండు వారాలు కీలకం: కేటీఆర్
రాబోయే రెండు వారాలు చాలా కీలకమని, లాక్డౌన్ నియమాలను ప్రజలందరూ పాటించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో పర్యటించిన మంత్రి అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. లాక్డౌన్ ముగిసేవరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన విధంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వాలకు సహకరించాలన్నారు. పాలిస్టర్ అసోసియేషన్ రూ.18 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. చెక్కును కేటీఆర్‌కు అందించారు. కార్మికుల సంక్షేమం కోసం ఆ మొత్తాన్ని వెచ్చించాల్సినదిగా కలెక్టర్‌ను మంత్రి కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 650కి చేరిన కేసులు