వచ్చే దసరా నాటికి ప్యాకేజీ-9 పనులను వందశాతం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలోని ప్యాకేజీ-9 సొరంగ మార్గం, బండ్, లైనింగ్, పంప్ హౌజ్ నిర్మాణం పనులను క్షేత్ర స్థాయిలో మంత్రి పరిశీలించారు. పనులు ఆశించిన మేరావేగంగా సాగడం లేదని మంత్రి ఇరిగేషన్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మరింత వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మల్కపేట రిజర్వాయర్ పనుల్లో రాజీ పడొద్దు: కేటీఆర్ - కేటీఆర్ మల్కపేట రిజర్వాయర్‌ను పనులను పరిశీలించారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మల్కపేటలో నిర్మిస్తున్న ప్యాకేజీ-9 పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. వచ్చే దసరానాటికి పనులను పూర్తిచేసి ఎగువమానేరు నుంచి గోదావరి జలాలను మల్కపేట రైతులకు అందించాలని అధికారులకు ఆదేశించారు.
![మల్కపేట రిజర్వాయర్ పనుల్లో రాజీ పడొద్దు: కేటీఆర్ ktr inspected malkapeta reservoir works in rajannasirisilla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7444327-393-7444327-1591090287899.jpg)
మల్కపేట రిజర్వాయర్ పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్
వాల్పేట జలాశయం, మల్కపేట జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నందున ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి బండ్‌కు ప్రత్యేక థీమ్‌తో ఆహ్లాదం కలిగించే పూల మొక్కలను హరితహారంలో భాగంగా నాటాలని మంత్రి.. అటవీ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం'
Last Updated : Jun 2, 2020, 7:09 PM IST