ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధి కార్తిక శోభను సంతరించుకుంది. కార్తిక సోమవారం కావడం వల్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు.. స్వామికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీతో పట్టణంలో ట్రాఫిక్ జామ్ నెలకొంది.
వేములవాడ రాజన్న సన్నిధిలో శివయ్యకు కార్తిక పూజలు - karhika puja at rajanna temple
కార్తిక దీపాలతో వేములవాడ రాజన్న సన్నిధి వెలుగులీనుతోంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక సోమవారం కావడం వల్ల రాజరాజేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించారు.
వేములవాడ రాజన్న సన్నిధిలో రద్దీ
కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆర్జిత సేవలు నిలిపివేసి.. భక్తులకు శీఘ్ర దర్శనం కల్పిస్తున్నారు. శివశంకరా.. ఓం నమఃశివాయ నామాలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.