రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయం తరలివచ్చిన భక్తులతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న ఆలయంలో భక్తుల సందడి - Rajanna siricilla latest news today
రాష్ట్రంలో కార్తికమాస పూజలతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
![రాజన్న ఆలయంలో భక్తుల సందడి kartheeka monday devotees in the Rajanna temple siricilla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9711747-1029-9711747-1606717190817.jpg)
రాజన్న ఆలయంలో భక్తుల సందడి
ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున జ్యోతులు వెలిగించారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చన అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఇదీ చూడండి :కార్తికమాస పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ