ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.
వేములవాడలో కార్తిక మాసం ప్రత్యేక పూజలు.. పోటెత్తిన భక్తులు - karthika masam special venerations in vemulavada temple
సోమవారం కార్తిక మాసం ముగుస్తుండడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పరమేశ్వరునికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తులు కార్తిక దీపాలు వెలిగించారు.

వేములవాడలో కార్తిక మాసం ప్రత్యేక పూజలు.. పోటెత్తిన భక్తులు
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అర్చకులు.. గర్భాలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనం అమలుపరిచారు. ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి:'ఆకలితో అలమటిస్తుంటే నూతన పార్లమెంటా?'