సిరిసిల్లలోని మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. రూ.8,500 గౌవర వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం జులై 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేశామన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 11 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల చేయలేదన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు ఇస్తున్నారని చెప్పారు.
'గౌరవ వేతనం ఇవ్వాల్సిందే' - panchayathi
రూ.8,500 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ సిరిసిల్లలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నా చేస్తున్న కార్మికులు