Vemulawada Temple: రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలు పెంపు.. వివరాలివే!
09:32 November 10
ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయశాఖ
వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో ఆర్జిత సేవల టికెట్ల ధరల( ticket prices )ను పెంచారు. ధరలు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వామి కల్యాణం టికెట్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1500కు పెంచారు. మహా రుద్రాభిషేకం టికెట్ ధర రూ.600 నుంచి రూ.1000కి పెంచగా.. అన్నపూజ టికెట్ ధర రూ.600 నుంచి రూ.1000 కి పెంపు చేశారు. సోమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర రూ.500 చేశారు. సోమేశ్వరాలయ అన్నపూజ టికెట్ ధర రూ.500లకు పెంచారు. సత్యనారాయణ వ్రతం టికెట్ ధర రూ.400 నుంచి రూ.600కు పెంపు చేయగా... కుంకుమ పూజ టికెట్ ధర రూ.150 నుంచి రూ.300లుగా చేశారు. భీమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర రూ.200 కాగా.. నవగ్రహపూజ టికెట్ ధర రూ.100 నుంచి రూ.300లు అయింది.
ఆర్జిత సేవలు | గతం ధర | ప్రస్తుతం |
స్వామి కల్యాణం టికెట్ ధర | రూ.1000 | రూ.1500కు పెంపు |
మహా రుద్రాభిషేకం టికెట్ ధర | రూ.600 | రూ.1000కి పెంపు |
అన్నపూజ టికెట్ ధర | రూ.600 | రూ.1000 కి పెంపు |
సోమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర | - | రూ.500కు పెంపు |
సోమేశ్వరాలయ అన్నపూజ టికెట్ ధర | - | రూ.500లకు పెంపు |
సత్యనారాయణ వ్రతం టికెట్ ధర | రూ.400 | రూ.600కు పెంపు |
కుంకుమ పూజ టికెట్ ధర | రూ.150 | రూ.300లకు పెంపు |
భీమేశ్వరాలయ అభిషేకం టికెట్ ధర | - | రూ.200కు పెంపు |
నవగ్రహపూజ టికెట్ ధర | రూ.100 | రూ.300లకు పెంపు |
ఇదీ చూడండి: KTR: 'యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి జరగాలి'