తెలంగాణ

telangana

ETV Bharat / state

నాకు షుగర్ ఉంది... ఎలా తెలిసిందంటే: కేటీఆర్​

KTR on Health Profile : మన ఆరోగ్య పరిస్థితులు మనం తెలుసుకుంటే దానికి తగినట్లు ప్లానింగ్ చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల సమగ్ర ఆరోగ్య వివరాలను నమోదు చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును వేములవాడలో మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. హెల్త్‌ ప్రొఫైల్​ కోసం వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ktr
ktr

By

Published : Mar 5, 2022, 7:25 PM IST

KTR on Health Profile : సిరిసిల్ల జిల్లాలో చేపట్టనున్న ఈ- హెల్త్‌ ప్రొఫైల్‌ను వేములవాడలో మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రత్యేకంగా ఒక కార్డును అందిస్తామని తెలిపారు. హెల్త్​ ప్రొఫైల్​ కోసం ప్రత్యేకంగా ఒక కిట్​ను రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి, దంత పరీక్ష కూడా చేస్తారని పేర్కొన్నారు. డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌ ద్వారా... ప్రజలకు మెరుగైన, వేగంగా వైద్యం అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.

ఇంటికి వద్దకు వచ్చే వైద్య సిబ్బందికి అందరూ తప్పనిసరిగా వివరాలు అందించాలని కేటీఆర్​ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం కావన్నారు. ఆ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని స్పష్టంచేశారు. హెల్త్‌ ప్రొఫైల్​ గురించి మంత్రి కేటీఆర్​ వివరిస్తూ తన గురించి పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.

'16, 17 ఏళ్లు క్రితం ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం ఏజెంట్​ను పిలిచా. ఆయన పరీక్షలు చేయాలి అంటే... చేయి నాకేం అయింది మంచిగ ఉన్న అని చేయమన్న. తెల్లారి వచ్చి సర్​ మీకు షుగర్ ఉంది అన్నడు. నాకు డౌట్ వచ్చింది... మళ్లీ పరీక్షలు చేయించుకున్నా. షుగర్​ ఉన్నట్లు వచ్చింది. నాకు షుగర్ ఉన్న విషయం నాకే తెల్వదు. నేను చదువుకున్నా.. అంతో ఇంతో తెలుసు. నాకు లోపల షుగర్ ఉన్నదని తెల్వదు. తెలుసుకుంటే ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకుంటాం.' - కేటీఆర్

నాకు షుగర్ ఉంది... ఎలా తెలిసిందంటే: కేటీఆర్​

ఇదీ చదవండి :తెలంగాణలో ఆక్సిజన్ అందక ఒక్కరు కూడా చనిపోలేదు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details