ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు కిటకిటలాడుతున్నారు. కార్తిక మాసం చివరి రోజు పైగా శివునికి ప్రీతికరమైన కార్తిక సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. వేకువ జామునే స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
రాజరాజేశ్వరుని సన్నిధికి పోటెత్తిన భక్తులు - రాజన్న సిరిసిల్లా లేటెస్ట్ న్యూస్
కార్తిక మాసం చివరి రోజు, మహా శివునికి ప్రీతిపాత్రమైన సోమవారాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. వేకువ జామునే స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు.
రాజరాజేశ్వరుని సన్నిధికి పోటెత్తిన భక్తులు
కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనం అమలుపరిచారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపి, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇదీ చదవండి:గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు