రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం కావడంతో తెల్లవారుజామునుంచే క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.
భక్తజన సంద్రం... వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం - రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో భక్తుల రద్దీ
కార్తికమాసాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తజన సంద్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం
మహిళలు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు ఆవుదూడలను కానుకలుగా స్వామివారికి బహుకరించారు.