రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడితో కోలాహలంగా మారాయి.
వేములవాడకు పోటెత్తిన భక్తులు - vemilawada temple news
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.
వేములవాడలో భక్తుల రద్దీ
తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో పెద్దఎత్తున భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తమ సిబ్బందితో పర్యవేక్షించారు. భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది.