రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తన పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ... చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
'చెన్నమనేని కేసులో కౌంటర్ దాఖలుకు వారం గడువు కావాలి' - వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని సర్కారు కోరింది.
high court hearing on vemulawada mla chennamaneni ramesh Citizenship dispute
కౌంటరు దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరగా... అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. కేసు విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ప్రత్యక్ష విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది.