ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని... రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహనా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
మోటార్ వాహన చట్టాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని అన్నారు.