మహా శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి హెలీటాక్సీ సేవలను ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ నెల 14 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్. అంజయ్య, బి. సత్యనారాయణ, జడ్పీ ఛైర్పర్సన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
వేములవాడలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం - rajanna sircilla dictrict news
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో హెలిటాక్సీ సేవలను ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. 14 వ తేదీ సాయంత్రం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
![వేములవాడలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం Helicopter services at vemulawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10948411-72-10948411-1615367850734.jpg)
వేములవాడలో హెలికాప్టర్ సేవలు
అనంతరం ఆలయ అధికారులతో కలిసి విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలు, ఏర్పాట్లను పరిశీలించారు. నాంపల్లి నుంచి వేములవాడ వరకు 7 నిమిషాల హెలికాప్టర్ ప్రయాణానికి రూ.3 వేలు చొప్పున టిక్కెట్, తిరుగు ప్రయాణంలో మధ్య మానేరు డ్యామ్ అందాలను వీక్షించేందుకు వీలుగా 15 నిమిషాల ప్రయాణానికి రూ. 5500 చొప్పున ప్రయాణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి:బద్రినాథుణ్ని దర్శించాలంటే.. సిద్దిపేట వెళ్లాల్సిందే!